top of page

సంక్షేమ పథకాలకు పెద్దపీట - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 12, 2022
  • 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. పేద, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశంసించారు.


బుధవారం 12వ మునిసిపల్ వార్డు నందు వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి చర్యలకు ఉపక్రమిస్తూ అటు ప్రభుత్వ అధికారులను, ఇటు సచివాలయ సిబ్బందికి దిశా నిర్దేశాలు చేశారు. అనంతరం వార్డులోని నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు. కార్యక్రమంలో భాగంగా లిబర్టీ నవాబ్ ఎమ్మెల్యే రాచమల్లు ను, వైస్ చైర్మన్ బంగారు ముని రెడ్డి ని గజమాలతో సత్కరించారు. రాచమల్లు లిబర్టీ నవాబుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసీపీ మహిళా పట్టణాధ్యక్షురాలు కోనేటి సునంద, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, వైసిపి కౌన్సిలర్లు గుఱ్ఱం లావణ్య, వరికూట ఓబుల్ రెడ్డి, భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పిట్టా బాలాజీ, అనిల్ కుమార్, షేక్ కమల్ భాష, జిలాన్, రాగా నరసింహారావు, వైసిపి నాయకులు 40 ఇంచార్జ్ రావులకొల్లు నాగేంద్ర, రాయపు రెడ్డి, కంభం పాములేటి, డీలర్ ఆంజనేయులు, ఆచారి కాలని శివారెడ్డి, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page